Monday, June 24, 2013

కవితా సంకలనం -2

ఆశ
నిశీధి బ్రతుకులనుండి గగనతీరాలదాక
కలల అలలపై స్వైరవిహారం చేస్తూ
నిను పెంచుతూ నలుగురికి పంచుతూ
ఉత్తుంగతరంగమై అణువణువునా నీలో నిండి
జీవితసమరాన వెరవని సంకల్పమనే
కత్తిని దూస్తూ నిను నడిపించేది
గమ్యం చేరాలని చేరితీరలనే ఆశ
అదే అవుతుంది నీ శ్వాస.

ప్రకృతి విలాపం

వెర్రికలలు కనే ఓ పిచ్చి మానవుడ ప్రశ్నార్ధకమౌతోంది ఇలపై నీ మనుగడ
సుఖంగానే వున్నావు ఇంతకంతే లోగడ యేల ఇపుడు చేసేవు ప్రకృతిని గడబిడ
తలచినావు విశ్వమంత అరచేతిలో ఇమడ్చగ ఆడినావు సాటి జీవ ప్రాణులతో విషక్రీడ
తెలిసి తెలిసీ మరిచి కొనసాగితె మిగిలేవు ఒరిగేవు మృత్యునీడ
 

Friday, June 7, 2013

కవితా సంకలనం -1

మిత్రులారా సన్నిహితులారా, నా పేరు చైతన్య. సాఫ్ట్వేర్ వ్రుత్తి, చదవటం వ్రాయటం నా ప్రవౄత్తి. కలంతో  కాగితాన్ని ఎంతో కాలంగా పాడుచేస్తున్నా అంతర్జాలంలొ ఇది నా మొదటిది. నా రాతలు కతలు మీ అందరితో పంచుకోవాలనే ఆశతో ఈ బ్లాగు మొదలుపెతున్నాను. కానీ నాకో సందేహం వచ్చింది. ఎన్నో బ్లాగులు వుండగా నా ఈ బ్లాగుకు ఆదరణ వుంటుందా అని. వేంటనే ముళ్ళపూడి వారి చిచ్చరపిడుగు నా బాల్య మిత్రుడు (పుస్తకం) "బుడుగు" సిగానపెసూనాంబతో సహా "జాటర్ ఢమాల్" అని నా ముందు ప్రత్యక్ష్యమై ఉపదేశం చేసాడు "ఎప్పుడు పెట్టామన్నది కాదన్నయ్య టపా ఎక్కిందా లేదా" అని. అంతే వాడి మాట శిరసా వహించి మహేష్ బాబుని ఆదర్శంగా తీసుకుని మొదలుపెట్టడానికి సిద్దం అయ్యాను. మనసుకు నచ్చింది కళ్ళు మెచ్చింది కవిత, కధల రూపంలో పెట్టాలనే నా ఈ ఆశకు మీ సహకారం తోడౌతుందని ఆశిస్తూ రెండు కవితలతో నా ప్రయాణం మొదలుపెడుతున్నాను.

ఉద్యోగ పర్వం:

ఏరోజు చూసినా ఏమున్నది గర్వకారణం
మానవజాతి సమస్తం ఉద్యోగపీడన పరాయణత్వం
లేస్తూనే మొదలయ్యే బానిసత్వం చీకటైనా వీడని కాలసర్పం
చేయకతప్పని జేవితం వెక్కిరిస్తొంది మనసు నిత్యం నిత్యం

స్పూర్తి:

జరుగుతుందని చూడకు జరుగలేదని బాధపడకు
జరుగనుందని మురవకు జరుగదేమోనని మధనపడకు
చెయ్యనిదే జరుగదు జరుగనిది చెయ్యలేవు
చెయ్యాలనుకున్నది చేయటమే అనుకున్నది జరుగటకు కారణం